రంగారెడ్డి: కంట్లూరులో కలకలం రేగింది. ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా యువతిని ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు. వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్కు లక్ష్మీ ప్రసన్న (21) వెళ్లారు. ఫోన్ మాట్లాడుతూ ఆమెకు నర్సు పద్మ వెంట వెంటనే రెండు డోసుల వాక్సిన్స్ ఇచ్చారు. వాక్సిన్ అనంతరం కొద్దీ సేపటికే యువతి కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి యువతిని తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నప్పటికి అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు అంటున్నారు. లక్ష్మీ ప్రసన్నకు ఏమి జరుగుతుందోనని కటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఫోన్ మాట్లాడుతూ వ్యాక్సిన్ రెండు డోసులు.. స్పృహ కోల్పోయిన యువతి
-