షాకింగ్‌ : తెలంగాణలో పానీపూరీ కారణంగా 2,700 మందికి టైఫాయిడ్

-

ఇండియాలో అయినా మరెక్కడైనా హెల్తీ ఫుడ్‌ కంటే జంక్‌ ఫుడ్‌ ను ఎక్కువగా జనాలు ఇష్టపడి తింటారు.హెల్తీ ఫుడ్‌ రుచిగా ఉండదు. కాని పలు ఉపయోగాలు ఉంటాయి.కాని జంక్‌ ఫుడ్‌ రుచిగా ఉంటుంది. కాని అనారోగ్య కారకాలు  కలిగి ఉంటాయి.అయినా కూడా ప్రతి చోట జంక్‌ ఫుడ్స్‌ను తింటూనే ఉంటారు. అయితే.. పానీపూరి అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. సాయంత్రం అయితే చాలు పానీపూరి బండి వద్ద సందడిగా ఉండటాన్ని మనం చూస్తుంటాం.

అంతలా పానీపూరీని కొందరు ఇష్టంగా తింటుంటారు. అయితే.. ఇంత ఇష్టంగా తినే పానీపూరీ ఇప్పుడు రోగాలకు అడ్డగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పానీపూరీ కారణంగా సుమారు 2,700 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ టైఫాయిడ్‌కు ‘పానీపూరీ డిసీజ్’ అని నామకరణం చేశామన్నారు. కామెర్లు, ప్రేగులలో మంటకు కారణమయ్యే పానీపూరీని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని సూచించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version