అండర్-19 ఆసియా మహిళల టీ20 ఛాంపియన్ గా భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్ పై టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 117 పరుగలు చేసింది. జట్టులో గొంగాడి త్రిష 47 బంతుల్లో 52 పరుగులు చేసింది.
అనంతరం 118 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3, సోనమ్ యాదవ్ , పరుణిక సోసోడియా 2 వికెట్లు, జోషిత ఇక వికెట్ పడగొట్టి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.