సీఎం రేవంత్, మంత్రులపై కమెడీయన్ సంచలన కామెంట్స్..!

-

తెలంగాణలో ప్రస్తుతం పుష్ప-2 వివాదం నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని సంధ్య థియేటర్ లో ప్రీమియర్స్ ప్రదర్శించిన సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి రావడం తొక్కిసలాట జరగడం.. దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళా మరణించిన విషయం విధితమే. ప్రస్తుతం రేవతి కుమారుడు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

శనివారం అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ రేవతి కుటుంబం గురించి ప్రస్తావించారు. అలాగే అల్లు అర్జున్ కి సంబంధించి మాట్లాడారు. ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ వాళ్లు స్పందించలేదని.. మహిళా కుటుంబాన్ని పరామర్శించలేదని  పేర్కొన్నారు. అల్లు అర్జున్ కి ఏమైంది.. కాలు విరిగిందా..? కన్ను పోయిందా అని రేవంత్ రెడ్డి అనడం పై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్, కరెంట్ కోతలు, సమంత పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అతను సెటైర్లు వేశారు. ఏపీలో అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వాన్ని మార్చితే. తెలంగాణ ప్రజలు డెవలప్ మెంట్ ఎక్కువై సర్కార్ ను మార్చారని వ్యాఖ్యానించారు. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version