కరోనాను, దానికి జన్మనిచ్చిన చైనాను, మన ఉగాదిని కలిపి ఒక ఔత్సాహిక కవి కలంనుండి జాలువారిన కొన్ని పంక్తులు… ‘మనలోకం’ పాఠకులకు..
’’నిగ్గదీసి అడుగు…ఈ సిగ్గులేని జనాన్ని…..’’ అంటూ సినీకవి సిరెవెన్నెల కొన్నేళ్ల క్రితం రాసిన ఈ గేయం నేటికీ సరిపోయేట్టుగా ఉంది. ఎన్ని రకాలుగా బతిమాలినా, ప్రాధేయపడినా, దండం పెడతానన్నా, జనాలు వినకుండా వీధులకెక్కుతున్నారు. ఈరోజు లాఠీలు విరిగితే కానీ, ఎవడికీ బుద్ధి రాలేదు. అంతే మరి… ‘దండం దశగుణం భవేత్..’’
ఈ నేపథ్యంలో ఒక ఉత్సాహవంతుడైన కవి, ఆసక్తికరంగా ఉన్న ఓ కవిత రాసాడు. సరళమైన మాటలతో, వ్యంగ్యంగా ఉన్న ఈ కవిత నెటిజన్ల ప్రశంసలను చూరగొంటోంది. ఆ కవిత ‘మనలోకం’ పాఠకుల కోసం..
ఇటునుం”చైనా”
అటునుం”చైనా”
ఎటునుం”చైనా”
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం”చైనా” జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం”చైనా” పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం”చైనా” చెబుదాం.
వారికి కాస్త మం”చైనా” చేద్దాం
అంతకు మిం”చైనా” సాధిద్దాం..
వినండి:
ఇంట్లొ ఉంటే ఉగాది
బయటకు వెళ్తే సమాధి.