కరోనా వైరస్ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్రం భావిస్తుంది. అందుకే ఏటీఎం లో కూడా చార్జీలను ఎత్తి వేస్తుంది కేంద్రం. దీనిపై ఆర్ధిక శాఖ ప్రకటన విడుదల చేసింది. అన్ని బ్యాంకులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. అలాగే డిజిటల్ లావాదేవీలపై కూడా చార్జీలను ఎత్తివేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఐటి రిటర్న్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుని గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకింగ్ విషయంలో కూడా ఈ నిర్ణయం ప్రకటించింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులకు కూడా సెలవలు ప్రకటించారు. దీనితో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ప్రజలకు ఎక్కాడా కూడా ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని చూస్తుంది. ఈ నిర్ణయం ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.