ఉగాది స్పెషల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

-

ఉగాది పండుగను పురస్కరించుకుని సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా ప్రత్యేకమైన ట్వీట్ చేశారు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ప్రస్తుతం అది వెరల్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు.

కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కించగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసింది.ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్-2’ సినిమాతో పాటు దేవర పార్ట్ 2లో కూడా నటిస్తున్నాడు.అలాగే ప్రశాంత్ నీల్‌తోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news