హిందువుల పండుగల్లో సందేశం, సైన్స్ ఉంటాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దీనికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలుగు ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
హిందువుల ప్రతీ పండుగలో సందేశం, సైన్స్ ఉంటుందని వివరించారు. కులాలకతీతంగా ప్రజలందరూ కలిసి ఉండాలనే పండుగలు మనకు సూచిస్తాయని చెప్పారు. రాష్ట్రం మరియు దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు.ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ మరింత పురోగమించడంతో పాటు ప్రపంచంలో మన దేశ ఖ్యాతి మరింత పెరగాలని ఆకాంక్షించారు. కొత్తఏడాదిలో తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.