సాధారణంగా బీరు రేటు ఎంత ఉంటుంది ? మన దేశంలో తయారు చేసింది అయితే వందల్లో ఉంటుంది.. ఫారన్ కంట్రీస్‌లో అయితే వేలల్లో ఉంటుంది. కానీ ఒక బీరు రూ. 73 లక్షలు ఎక్కడన్నా విన్నారా? యూకేలోని ఓ హోటల్‌లో ఓ వ్యక్తి కేవలం ఒక బీరు తాగినందుకు 99,983.64 డాలర్ల బిల్లు వేశారు. భారత కరెన్సీలో రూ.71.70 లక్షలన్నమాట. మరి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా స్పోర్ట్స్ జర్నలిస్టు పీటర్ లేలర్ మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్ అనే హోటల్‌కు వెళ్లారు.
దీంతో అతడు తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ట్విట్టర్‌లో తాను తాగిన బీరు బాటిల్ ఫొటో పెట్టి తన చేదు అనుభవాన్ని వివరించాడు. అయితే సర్వర్ స్వైపింగ్ మెషీన్‌లో డబ్బులు టైప్ చేయడంలో పొరపాటు చేశాడు. ఇక కార్డును స్వైప్ చేసి పిన్ నెంబర్ నొక్కగానే ఒక్కసారిగా 73 లక్షలు హోటల్ ఖాతాలోకి వెళ్లిపోయాయి.
విషయం తెలుసుకున్న యాజమాని పీటర్‌కు క్షమాపణ చెప్పి డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పారు. బిల్లింగ్ మెషిన్‌లో లోపం వల్ల ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు. బ్యాంకును సంప్రదించి వెంటనే రిఫండ్ అందేలా చర్యలు తీసుకుంటామని హోటల్ మేనేజర్ తెలిపాడు.