ప్రపంచంలోని రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ లో కరోనా కేసులు భారీగా పెరగడం ప్రపంచ దేశాలను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. ఈ నేపధ్యంలో మన దేశం నుంచి వెళ్ళే విమానాల విషయంలో ప్రపంచ దేశాలు అన్నీ కూడా కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయి. పలు దేశాలు భారత్ నుంచి విమానాలను రద్దు చేసాయి. తాజాగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆస్ట్రేలియా కూడా అదే నిర్ణయం తీసుకుంది.
భారత్ కు వెళ్ళే అన్ని విమానాలను మే 15 వరకు తమ దేశం నిలిపివేస్తుందని ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం ప్రకటించారు. మన దేశంలో రోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో, 3 వేల మంది వరకు ప్రతీ రోజు ప్రాణాలు కోల్పోవడంతో కేంద్రం కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది.