రష్యా- ఉక్రెయిన్ మధ్య వార్ పదో రోజుకు చేరుకుంది. రోజు రోజుకు యుద్ధ తీవ్రత పెరుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కీవ్ తో పాటు ఖార్కీవ్ నగరంపై రాకెట్లతో దాడులు చేస్తోంది. యుద్ధం మొదట్లో కేవలం మిలటరీ పోస్ట్ లపైనే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నప్పటికీ… ప్రస్తుతం జనావాసాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్ లపై కూడా దాడులు చేస్తోంది.
అయితే రష్యన్ సైనికులు దురాగతాలు పాల్పడుతున్నారని… ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కుబేలా సంచలన ఆరోపణలు చేశారు. రష్యా ఆక్రమించుకున్న నగరాల్లోని మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఒక పక్క బాంబుల మోత… మరో వైపు ఆడవాళ్లపై అత్యాచారాలు జరడగం చూస్తుంటే.. బాధ కలుగుతుందని ఆయన అన్నారు. రష్యా దూకుడుగా వ్యవహరిస్తుందని ప్రతీ చర్యకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే నిన్న రష్యా తన ఆధీనంలోకి తీసుకున్న జపోర్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ఈరోజు ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేేసుకున్నాయి.