ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో నేటి నుంచి రెఫరెండం..!

-

ఉక్రెయిన్‌పై దాడి చేసి రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలను తమ దేశంలో కలుపుకునేందుకు రష్యా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికోసం ఇవాళ్టి నుంచి రెఫరెండం షురూ మొదలుపెట్టింది. ఈ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడానికి స్థానికులు సానుకూలత వ్యక్తం చేసినట్లు ప్రపంచానికి చూపేందుకు ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ రెఫరెండం ఈనెల 27న ముగియనుందని వార్తాసంస్థల్లో కథనాలు వెలువడుతున్నాయి.

 

తూర్పు వైపు దొనెట్స్క్‌, లుహాన్స్క్‌.. దక్షిణం వైపు ఖేర్సన్‌, జపోరిజియాల్లో రష్యా సైన్యం పర్యవేక్షణలో దీనిని నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌ సహా పశ్చిమ దేశాలు ఈ చర్యను భూకబ్జాగా అభివర్ణిస్తున్నాయి. ఇదొక సిగ్గుమాలిన చర్య అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మండిపడ్డారు. దాదాపు 3,00,000 మంది రిజర్వు దళాలను సమీకరిస్తామని రష్యా  అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించిన రోజుల వ్యవధిలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version