ఉక్రెయిన్ – రష్యా వార్: భారతీయులకు పలు సూచనలు చేసిన ఇండియన్ ఎంబసీ

-

ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర యుద్ద జరుగుతోంది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులు ఆందోళనకు గురి అవుతున్నారు. దీంతో ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ భారతీయులకు కీలక సూచనలు చేసింది. ఉక్రెయిన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని… ఎక్కడి వారు అక్కడే ఉండాలని భారతీయులకు ఎంబసీ సూచనలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లోద్దని.. ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. రాజధాని కీవ్ వైపు ఎట్టి పరిస్థితుల్లో రావద్దని హెచ్చరించింది. ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది ఇండియన్ ఎంబసీ.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉక్రెయిన్ లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మందిని ప్రత్యేక విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకువచ్చింది. ఉక్రెయిన్ ఎయిర్ స్పెస్ మూసివేయడంతో.. ఇండియా నుంచి బయలు దేరిన విమానం ఈరోజు వెనక్కి వచ్చింది. మరోవైపు ఎయిర్ స్పెస్ మూసివేయడంతో… భారతీయులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా తీసుకువచ్చే ప్రణాళికలను భారత్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version