రష్యా- ఉక్రెయిన్ మధ్య వార్ వల్ల తీవ్ర మానవ సంక్షోభం తలెత్తింది. యుద్ధం కారణంగా చాలా మంది ఉక్రెయిన్ పౌరులు పొట్ట చేతిన పట్టుకుని పరాయి దేశాలకు వలస వెళ్తున్నారు. సరిహద్దు దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. 11 రోజుల్లోనే 15 లక్షలకు మంద ప్రజలు వలసపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్ లో ఇంత పెద్ద ఎత్తున వలస జరగడం ఇదే మొదటిసారి అని యూఎన్ఓ శరణార్థి సంస్థ వెల్లడించింది. ఉక్రెయిన్ లో నుంచి వరస వెళ్లే వారి సంఖ్య 70 లక్షలకు చేరవచ్చని ఐక్యరాజ్య సమితి అంచానా వేస్తోంది. ఇది ఈ శతాబ్ధంలోనే అతి పెద్ద సంక్షోభం అని అంటోంది. 1.80 కోట్ల మంది ప్రజలపై యుద్ధం ప్రభావం ఉంటుందని అంచనా.
ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దేశాలు పోలాండ్, రొమేనియా, హంగేరి దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. వరలసల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. తాము ఏమైనా పర్వాలేదు కానీ తమ పిల్లలు, భార్యలు, తల్లిదండ్రులు బాగా ఉండాలని మగవాళ్లు వారిని వేరే ప్రాంతాలకు పంపినస్తున్నారు. ఇలా పలు నగరాల్లోని రైల్వే స్టేషన్లలో తమ కుటుంబ సభ్యులను చూడటం ఇదే ఆఖరి సారి అవుతుందేమో అని కన్నీరు పెడుతున్నద్రుశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.