36 దేశాలపై రష్యా ఆంక్షలు… తమ గగనతలం నుంచి విమానాలు రాకుండా నిషేధం

-

ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం వెస్ట్రన్ కంట్రీస్, రష్యా మధ్య ఆంక్షలను పెంచుతున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలలో జర్మనీ, ఫ్రాన్ వంటి దేశాలతో పాటు బ్రిటన్, అమెరికా, కెనడా, జపాన్ వంటి దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే రష్యాకు సంబంధించిన నాలుగు బ్యాంకులపై చర్యలు తీసుకున్నాయి. తమ గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలను నిషేధించాయి. 

దీంతో రష్యా కూడా ఆంక్షలను విధిస్తోంది. తాజాగా 36 దేశాలపై రష్యా ఆంక్షలు విధించింది. ఈ దేశాలకు చెందిన విమానాలు తమ గగనతలం నుంచి వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ జాబితాలో బ్రిటన్, జర్మనీ, ఇటలీ, కెనడా, స్పెయిన్ దేశాలు కూడా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధించడంతో రష్యా విదేశాంగ మంత్రి లావ్ రోవ్.. జెనీవాలో జరుగుతున్న యూఎన్ సమావేశాలను రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉంటే బెలారస్ పై అమెరికా ఆంక్షలు విధించింది. బెలారస్ రష్యాకు సహరిస్తుందని అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈయూ దేశాలు కూడా బెలారస్ పై అమెరికా మార్గాన్నే అనుసరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version