Bigg Boss 5 : ఈ వారం బిగ్ బాస్ నుంచి ‘ఉమాదేవి’ ఔట్

-

బిగ్‎బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షోలో ర‌చ్చ మాములుగా లేదు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పొమ్మ‌న లేక పొగ‌పెట్ట‌డు అన్న‌ట్టు బిగ్ బాస్ ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఎవ‌రి? ఎప్పుడూ ? ఎలా? ఆడుకోవాలో బిగ్ బాస్ కు బాగా తెలుసు. మొదటి ఎలిమినేషన్ లో ట్విస్ మాములుగా లేదు.. ఎవ్వ‌రూ ఉహించ‌ని విధంగా ఎలిమినేషన్ జ‌రిగింది. ఇక తొలి వారం ఎలిమినేషన్స్ లో అనూహ్యంగా సరయు ఎలిమినేట్ అయింది.

ఇక రెండవ వారంలో యానీ మాస్టర్, ఉమాదేవి, ప్రియాంక సింగ్, నటరాజు, ఆర్ జి కాజల్ మరియు లోగోలు నామినేట్ అయ్యారు. అయితే వీరిలో … ఈవారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. బిగ్బాస్ తుది దశ నుంచి చాలా అగ్రెసివ్ గా ఉన్న ఉమాదేవి… నామినేషన్ సందర్భంగా తిట్టిన బూతులు చాలామందికి ఇబ్బందిగా అనిపించాయి. అయితే ఆ తర్వాత ఆమెకు బిగ్ బాస్ ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఆమెను చాలావరకు పాజిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారు.

అయితే నామినేషన్స్ లోకి వచ్చిన తొలి రెండు రోజుల్లోనే ఆమెకు నెగిటివ్గా చాలా ఓట్లు పడ్డాయి. ఈ రెండు, మూడు రోజులు ఉమాదేవి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ వైపు కార్తీకదీపం ఫ్యాన్స్ మరోవైపు ఆమె పెర్ఫార్మెన్స్ చూసి.. పాజిటివ్ ఓట్లు వేశారు. అయినప్పటికీ ఉమాదేవికి ఈవారం ఎలిమినేషన్ గండం తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version