చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాపై రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు..!

-

తాజాగా చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండుగకు పోటీ పడడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 12వ తేదీన బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి.. జనవరి 13వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమాలు భారీ స్థాయిలో ఒక్కరోజు తేడాతో పోటీ పడుతున్నట్లు సమాచారం. దీంతో అభిమానుల మధ్య పోటీ కూడా ఏర్పడింది. ఒకవేళ బాలయ్య సినిమా హిట్ అయితే చిరంజీవి అభిమానులు .. చిరంజీవి సినిమా హిట్ అయితే బాలయ్య అభిమానులు నిరాశ చెందే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు షాకింగ్ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనానికి దారి తీసింది.

తాజాగా ప్రతి డిజాస్టర్ సినిమాకి గతంలో ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సందు ఇప్పుడు చాలావరకు నెగిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలోని చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకి కూడా ఈయన నెగటివ్ రివ్యూ ఇవ్వడం ఇప్పుడు అభిమానులలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉమైర్ సందు తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. “చిరంజీవి గారు దయచేసి ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చేయడం ఆపేసి.. సీరియస్ రోల్స్ చేయండి.. మీ నుంచి ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చూసి చూసి బోర్ కొట్టేసింది. వాల్తేరు వీరయ్య సినిమా చిరంజీవికి మరో డిజాస్టర్ కానుంది ” అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఉమైర్ సందు ట్వీట్ చేయడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది.

రొటీన్ కమర్షియల్ , రొమాంటిక్ స్టోరీలు కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయండి.. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు.. కచ్చితంగా డిజాస్టర్ అవుతుందేమో అంటూ తన అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించారు ఉమైర్ సందు. అయితే కొంతమంది చిరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. మరి కొంతమంది ఈయన ఇచ్చే రివ్యూ దాదాపు ఫాల్ట్ గా ఉంటుందని లైట్ తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version