ఆసియా కప్ 2022 కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం తమ జట్టు అసిస్టెంట్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఇంగ్లాండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఉమర్ రషీద్ ను యూఏఈకు పిసిబి పంపించింది. రషీద్ ప్రస్తుతం, లాహోర్ లోని నేషనల్ హై పెర్ఫార్మన్స్ సెంటర్ లో బౌలింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు.
మొహమ్మద్ హస్నైన్ వంటి అత్యుత్తమ బౌలర్లను తయారు చేయడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ పాస్ట్ బౌలింగ్ కోచ్ తో కలిసి పని చేయనున్నాడు. ఇక ఉమర్ రషీద్ తన ఫస్ట్ క్లాస్ లో మిడిల్ సెక్స్, సస్సేక్స్ జట్టుల తరఫున ఆడాడు.
కాగా ఆసియా కప్ కు ఆ జట్టు స్టార్ పెసర్ షాహిన్ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో పెసర్ మొహమ్మద్ హస్నైన్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ లో ఆగస్టు 28న భారత్ తో తలపడనుంది. ఇక ఇప్పటికే యూఏఈ కు చేరుకున్న ఇరుజట్లు తమ ప్రాక్టీసును మొదలుపెట్టాయి.