ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తీసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే సినిమాలు చేసి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇకపోతే టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల, కాస్ట్యూమ్ డిజైనర్ రూప దంపతులకు ముగ్గురు కుమార్తెలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక గతంలో శ్రీను వైట్ల తన భార్య రూప ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు వైరల్ అయినప్పటికీ ఆ విషయంపై శ్రీనువైట్ల స్పందిస్తూ.. నా ముగ్గురు కూతుర్లు, నా భార్యను వదిలి నేను ఉండలేను . దయచేసి రూమర్ క్రియేట్ చేయకండి అంటూ మీడియా వారిపై కూడా మండిపడ్డాడు. దీన్ని బట్టి చూస్తే ఆయనకు తన భార్య, పిల్లలపైన ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఏ విషయంపై పెద్దగా స్పందించని శ్రీను వైట్ల ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తం చేశాడు. అంతేకాదు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతూ ఈయన చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే.. శ్రీనువైట్ల పెద్ద కూతురు అమెరికాకు చదువుల కోసం బయలుదేరింది. ఎయిర్ పోర్ట్ లో కుమార్తెను బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతున్న వీడియోను శ్రీనువైట్ల అభిమానులతో పంచుకున్నారు.
My eldest daughter has flown to US for her under-grad.
Now I understand how my father might have felt when I left for Chennai at the same age. Life is a cycle and I am sure.. my dearest Aanandi would make me the prouder father!
❤️ pic.twitter.com/xjJ1o80Wgz— Sreenu Vaitla (@SreenuVaitla) August 24, 2022