తూర్పుగోదావరి జిల్లా : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంట తడిపై మాజీ ఎం పి . ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో కొత్త సంప్రదాయాలపై మండిపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. అసెంబ్లీ లో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే నని వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని.. అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని సూచనలు చేశారు. రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు అప్పులు పెరిగాయని.. గడిచిన రెండేళ్లలోనే వైసిపి ప్రభుత్వం 3 లక్షలకు పైబడి అప్పులు చేసిందని నిప్పులు చెరిగారు ఉండవల్లి అరుణ్ కుమార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన లో ఘోరంగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇక నైనా జగన్ సర్కార్ లో మార్పు రావాలని పేర్కొన్నారు.