రూ. 10 కే ఎల్‌ఈడీ బల్బు పథకాన్ని ప్రారంభించిన కేంద్రం

-

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ గ్రామీణ ప్రజలకు రూ. 10 కే ఎల్‌ఈడీ బల్బులను అందించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించింది. ‘గ్రామ ఉజాలా’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని కేంద్ర విద్యుత్, నూతన–పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ బీహార్‌లో ప్రారంభించారు. ఈ పథకం మొదటి దశలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయనున్నారు. ఆ గ్రామాల్లో విద్యుత్‌ ను పొదుపు

చేసే అత్యంత నాణ్యమైన 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను అతి తక్కువ ధరకు విక్రయించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర ప్రదేశ్‌ మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ గుజరాత్‌ లోని గ్రామాల్లో ఈ ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ గ్రామాలకు గ్రామ ఉజ్వాలా పథకం కింద మూడేళ్ల వారెంటీతో 7, 12 వాట్ల ఎల్‌ఈడీ బల్బులను అందించనున్నారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 5 బల్బులను అందించనున్నారు. గ్రామీణ విద్యుత్‌ వినియోగదారులు తమ వద్ద ఉన్న పని చేసే బల్బులను అందించి వాటికి బదులుగా ఈ ఎల్‌ఈడీ బల్బులను పొందే అవకాశం ఉంటుంది. ఈ బల్బులకు మూడేళ్ల వరకు వారంటీ ఉంటుంది.

ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) అనుబంధ కంపెనీ కన్వర్జెటీస్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) ఈ పథకం నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. ఈ బల్బులను వినియోగంచడం ద్వారా విద్యుత్‌ వినియోగంతో పాటు మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ప్రభావం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వినియోగదారులకు కూడా విద్యుత్‌ ఛార్జీలు ఆదా అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version