బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు సీతారామన్… రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి బడ్జెట్ పత్రాల కాపీని ఆయను అందజేశారు. అక్కడి నుంచి పార్లమెంట్ కు విచ్చేశారు.
కేంద్ర బడ్జెట్ 2019ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా రికార్డుకెక్కిన నిర్మలా సీతారామన్… ఇవాళ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె ప్రవేశపెట్టే బడ్జెట్ ను వినేందుకు నిర్మలా అమ్మానాన్న కూడా పార్లమెంట్ కు వచ్చారు.
బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు సీతారామన్… రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి బడ్జెట్ పత్రాల కాపీని ఆయను అందజేశారు. అక్కడి నుంచి పార్లమెంట్ కు విచ్చేశారు.
ఇవాళ.. బడ్జెట్ సందర్భంగా దేశీయ మార్కెట్లు బడ్జెట్ కళను సంతరించుకున్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెక్సెక్స్ ఇవాళ ఉదయమే 104 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 28 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది.