ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటే మీ అకౌంట్ లోని డబ్బులు గోవిందా.. ఆర్బీఐ వార్నింగ్

-

ఆ యాప్ ను మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకుంటేనే అసలు సమస్య. ఆ యాప్ ను మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకొని… అది మీ మొబైల్ నెంబర్ కు పంపించే 9 సంఖ్యల నెంబర్ ను ఎంటర్ చేశారంటే అంతే. ఆ యాప్ మీ మొబైల్ ను తన చేతుల్లోకి తెచ్చుకొని… మీ మొబైల్ లోని బ్యాంకింగ్ యాప్స్ కు సంబంధించిన డేటాను అంతా తస్కరిస్తుంది.

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. దాన్ని మంచి కోసం కాకుండా చెడు కోసం ఉపయోగించేవాళ్లే ఎక్కువైపోయారు. ఆత్యాధునిక సాంకేతికత, స్మార్ట్ ఫోన్లు, విభిన్నమైన యాప్స్.. ఇవన్నీ మనిషిని మరో విధంగా ఆలోచించేలా చేస్తున్నాయి. రోజురోజుకూ బ్యాంకింగ్ యాప్స్ కూడా పుట్టలుపుట్టలుగా వస్తుండటంతో… బ్యాంకింగ్ లావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్ లోనే అన్ని పనులు ఇప్పుడు చక్కదిద్దుకోవచ్చు. అయితే.. దీన్నే అవకాశంగా తీసుకుంటున్న కొందరు… ఫ్రాడ్ యాప్ లను సృష్టించి… వాటి ద్వారా కస్టమర్ల అకౌంట్లలోని డబ్బులను దండుకుంటూ కొత్త దందాకు తెర తీశారు.

అందులో ఒకటే ఎనీడెస్క్ అనే యాప్. అవును… ఈ యాప్ తో రిమోట్ గా వేరే డివైజ్ లను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చు. ఆ యాప్ ను మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకుంటేనే అసలు సమస్య. ఆ యాప్ ను మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకొని… అది మీ మొబైల్ నెంబర్ కు పంపించే 9 సంఖ్యల నెంబర్ ను ఎంటర్ చేశారంటే అంతే. ఆ యాప్ మీ మొబైల్ ను తన చేతుల్లోకి తెచ్చుకొని… మీ మొబైల్ లోని బ్యాంకింగ్ యాప్స్ కు సంబంధించిన డేటాను అంతా తస్కరిస్తుంది.

ఎనీడెస్క్ ను ఇన్ స్టాల్ చేసుకొని తమ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు పోగొట్టుకున్న చాలామంది కస్టమర్లు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై స్పందించిన ఆర్బీఐ కూడా ఆ యాప్ ను బ్యాంకింగ్ కస్టమర్లు ఇన్ స్టాల్ చేసుకోవద్దని హెచ్చరించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఈ యాప్ కు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యాప్ ను తమ మొబైల్స్ లో ఇన్ స్టాల్ చేసుకోవద్దని చెప్పింది.

సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి కానీ.. లింక్ ద్వారా కానీ… ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలంటూ చెబితే.. అస్సలు ఇన్ స్టాల్ చేసుకోవద్దని.. అనుమానిత లింక్స్ పై క్లిక్ చేయొద్దని సూచించింది. మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీని చెప్పాలంటూ అనుమానితులు ఫోన్ చేసినా కూడా అటువంటివేవీ వాళ్లతో షేర్ చేసుకోవద్దని ఓ ప్రకటనను హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version