ఆటోమొబైల్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనం మరియు హైడ్రోజన్ ఇంధన సెల్ వాహనాలను ప్రొత్సహించడానికి… ఆటోమొబైల్ రంగానికి రూ .26,000 కోట్ల వ్యయంతో ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకం (PLI) పథకాన్ని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఈ PLI స్కీమ్ కోసం రూ. 57,043 కోట్ల నుండి రూ .26,000 కోట్లకు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.
అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీలపై దృష్టి పెట్టడానికి ఈ పథకాన్ని తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ మరియు CNG వాహనాల తయారీదారులు ఈ పథకం పరిధిలోకి రావని కేంద్రం తెలిపింది. కొత్తగా ప్రకటించిన PLI పథకం FY23 నుండి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉండనుంది. మరియు అర్హత ప్రమాణాల కొరకు బేస్ సంవత్సరం 2019-20. మొత్తం 10 వాహన తయారీదారులు, 50 ఆటో కాంపోనెంట్ మేకర్లు మరియు ఐదు కొత్త నాన్-ఆటోమోటివ్ పెట్టుబడిదారులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందుతారు.
ఆటో కాంపోనెంట్ PLI పథకం కింద, మొత్తం 22 భాగాలు కవర్ చేయబడతాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ కిట్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, హైబ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లు మరియు ఎలక్ట్రిక్ వాహనాల భాగాలు, ఛార్జింగ్ పోర్ట్‌లు, డ్రైవ్ ట్రైన్, ఎలక్ట్రిక్ వాక్యూమ్ పంప్ మరియు ఎలక్ట్రిక్ కంప్రెసర్‌లు, సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లు ఈ ఆటో కాంపోనెంట్ PLI పథకం కిందకు వస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనం మరియు హైడ్రోజన్ ఇంధన సెల్ వాహనాలను ప్రొత్సహించడమే ఈ పథకం లక్ష్యం.