ఆంధ్ర ప్ర‌దేశ్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి

-

రేపు తిరుప‌తి లో నిర్వ‌హించ బోయే స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం లో పాల్గొన టానికి కేంద్ర హోం మంత్రి అమితి షా కాసేప‌టి క్రితం ఆంధ్ర ప్ర‌దేశ్ కు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుంచి అమిత్ షా నేరుగా తిరుమలకు పయనం అవుతున్నాడు. తిరుమ‌ల‌లో స్వామివారిని దర్శనం చేసుకోనున్నారు.

అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నెల్లూరు స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ రాఊ ముఖ్య మంత్రి నేరుగా తాడేపల్లి కి వెళ్ల‌నున్నారు. అయితే రేపు ఉదయం తిరుప‌తి న‌గ‌రంలో స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి దక్షిణ భార‌త‌దేశం లో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్రపాలిత రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్లు, మంత్రులు పాల్గొటారు. అయితే ఈ స‌మావేశానికి మ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ డుమ్మ కొడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్య మంత్రి కేసీఆర్ స్థానం లో రాష్ట్ర హోం మంత్రి మ‌హ్మ‌ద్ ఆలీ తో పాటు సీఎస్ హ‌జ‌రు అవుతున్న‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version