మరోసారి కాంగ్రెస్‌తో బాబు…ఈ సారి ఫిక్స్?

-

ఏదేమైనా చంద్రబాబుకు కాంగ్రెస్ వాసనలు పోవడం లేదు. ఆ పార్టీ నుంచే రాజకీయంగా ఎదిగి వచ్చారు కాబట్టి..ఆ పార్టీతో పరోక్షంగా సన్నిహితంగానే మెలుగుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో చంద్రబాబు ఎలా ఎదిగారు..ఆ తర్వాత టీడీపీలోకి ఎలా వచ్చారనే విషయాలు అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ టీడీపీ పెట్టింది కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై..కానీ చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పునాదుల నుంచే టీడీపీలోకి వచ్చారు.

అందుకే ఆయన కాంగ్రెస్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటారని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇక రాష్ట్ర విభజన జరిగాక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారైంది. అయితే తెలంగాణలో కొద్దో గొప్పో పటిష్టంగా ఉంది. కానీ 2018 ఎన్నికల్లో చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్‌తో బాబు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు. ఇక ఆ పొత్తు పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రంలో కూడా బీజేపీని ఓడించాలని చెప్పి కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు.

దాని వల్ల ఏపీలో టీడీపీ ఎలా దెబ్బతిందో చెప్పాల్సిన పని లేదు. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. అటు కేంద్రంలో కాంగ్రెస్ కూడా ఘోరంగా ఓడిపోయింది. అయినా సరే చంద్రబాబు, కాంగ్రెస్‌తో కాస్త సన్నిహితంగానే ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఏపీలో బాబు, జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇక బాబు బాటలోనే ఏపీ కాంగ్రెస్ నేతలు సైతం జగన్‌పైనే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంటే పరోక్షంగా బాబుకు బెనిఫిట్ అయ్యేలా చేయాలని చూస్తారు.

అలా చేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ తమతో కలిసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ బీజేపీతో పొత్తు సెట్ కాకపోతే…కాంగ్రెస్‌తోనే బాబు ముందుకెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో పొత్తు లేకపోయినా కేంద్ర స్థాయిలో కాంగ్రెస్‌కు మద్ధతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ సారి ఏమన్నా తేడా జరిగితే…టీడీపీ పూర్తిగా నాశనం అవ్వడం ఫిక్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version