టెర్రరిజం నాగరికత సమాజానికి మచ్చ అని, జాతీయ భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 26/11 ముంబై దాడులపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులర్పించారు.26/11 దాడులను పిరికిపంద చర్యగా కేందమంత్రి అభివర్ణించారు. ఈ దాడుల్లో ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన భద్రతా సిబ్బందికి సెల్యూట్ చేశారు.
ముంబై దాడుల్లో మరణించిన అమాయక ప్రజలకు హృదయపూర్వక నివాళులర్పించారు. నేను దేశంతో కలిసి ఉన్నానని చెప్పారు.ఉగ్రవాదం మానవ నాగరికతకు మచ్చ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన ‘జీరో టాలరెన్స్’ విధానం, భారత్ విపత్తుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రపంచ నాయకుడిగా ఆయన ఉద్భవించారన్నారు. మోడీ నేతృత్వంలో జాతీయ భద్రతపై ఎటువంటి రాజీ పడేది లేదని బండి సంజయ్ స్పష్టంచేశారు.