ఆర్టీసీ బస్సులో గుండెపోటు.. సీపీఆర్ చేసినా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

-

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. యాదాద్రి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. అప్రమత్తమైన కండక్టర్ సహా తోటి ప్రయాణికులు గుండె పోటు వచ్చిందని గుర్తించారు.

అనంతరం తోటి ప్యాసింజర్ ఒకరు సీపీఆర్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఆ వ్యక్తికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు గుండెపోటుకు గురైన వ్యక్తి గురించి ఆరా తీశారు. మృతుడు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన గీతాకార్మికుడు డొంకెని పాండు(59)గా గుర్తించారు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version