దేశవ్యాప్తంగా…. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటేశాయి పెట్రోల్ ధరలు. అటు డీజిల్ కూడా పెట్రోల్ తో పోటీపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో లో పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి హార్దిప్ సింగ్ పూరి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై త్వరలోనే దేశ ప్రజలు ఒక శుభవార్త వింటారు అని ఆయన పేర్కొ న్నారు.
రానున్న కొద్ది నెలల్లో వాటి ధరల భారం నుంచి ఉపశమనం లభించే అవ కాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా వస్తున్నాయని మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం ఈ సందర్భంగా ఆయన వివరించారు. పెట్రోల్ ధరల అంశాన్ని కేంద్ర ప్రభుత్వ అత్యంత సున్నితమైన దిగావ్ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ ధరలపై వచ్చిన ఆదాయాన్ని వ్యాక్సిన్ లపై ఖర్చు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.