వీర్ బాల్ దివస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక కామెంట్స్..!

-

1500 ఏండ్ల క్రితం భారతీయత కోసం, ధర్మం కోసం పదవ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన.. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ బలిదానమయ్యారు. డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్‌గా గుర్తించడం వారి త్యాగానికి, ధైర్యానికి ఘన నివాళి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఆ వీరపుత్రులకు ఘన నివాళులర్పిస్తున్నాం. వారిద్దరు సిక్కుల పథానికి, ధర్మానికి అంకితమై తమ ప్రాణాలను అర్పించి చిన్న వయసులోనే అమరులైన వీరులు.

మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. అదేవిధంగా డిసెంబరు 26న వీర్ బాల్ దివస్ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రధానమంత్రి మోదీ వీర్ బాల్ దివస్‌ను యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 2022లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాలు మొదటి సారిగా నిర్వహించబడ్డాయి. సాహిబ్‌జాదా జోరావర్ సింగ్, సాహిబ్‌జాదా ఫతే సింగ్ ల ధైర్యం, త్యాగాలకు నివాళి అర్పించడం జరిగింది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news