ఎన్నికలకు కరోనాకు సంబంధం లేదు: కేంద్రం

-

5 రాష్ట్రాల ఎన్నికల కారణంగానే కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి అనే ఆరోపణల నేపధ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా లాక్ డౌన్  అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని స్పష్టం చేసారు. వారసిగూడా ఎక్స్ రోడ్స్ లో శానిటైజర్ వెహికల్స్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాస్కులు పోలీసుల కోసం కాదు.. మీ రక్షణ కోసం మాస్కులని గుర్తుపెట్టుకోండి అని ఆయన సూచించారు.

లాక్ డౌన్ లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కోసం లాక్ డౌన్ లు పెడుతున్నాయి. ప్రజలు సహకరించాలి అని కోరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు, సెకండ్ వేవ్ కు సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఈసీకి సంబంధించిన విషయం ప్రభుత్వాలది కాదు అని అన్నారు. ప్రభుత్వం చేసే సూచనలను తప్పక పాటించి కరోనా చైన్ ను బ్రేక్ చేయండి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version