వీజే సన్నీ, బిందు మాధవి మధ్య మళ్లీ మాటల యుద్ధం..ఎక్కడంటే?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ నాన్ స్టాప్ షో లో వీజే సన్నీ, బిందు మాధవి మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి అందరికీ విదితమే. అయితే, చివరకు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ ను బిందు మాధవి దక్కించుకుంది. కాగా, తాజాగా మళ్లీ వీరి మధ్య ఫైట్ షురూ అయింది. ఇందుక సంబంధించిన ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

వివరాల్లోకెళితే…బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న తొలి ఫిమేల్ కంటెస్టెంట్ గా బిందు మాధవి రికార్డు సృష్టించింది. ఆమెను తీసుకొచ్చి స్టార్ మా వారు ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇందులో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీని కూడా తీసుకొచ్చారు. దాంతో వీరిరువురి మధ్య మళ్లీ మాటల యుద్ధం షురూ అయింది.

యాంకర్ రవి…వీరిరువురి మధ్య ఫైట్ గురించి ప్రస్తావించగా, ‘తుఫాన్ వచ్చే ముందర క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుందని, తర్వాత వయ్ లెంట్ అయిపోతుందని ’ తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్పింది. ఇక ఆ తర్వాత వీజే సన్నీతో గేమ్స్ ఆడినట్లు ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. ఆడపులి అలియాస్ బిందు మాధవి..ఈ స్టార్ మా వారి ‘బిగ్ బాటిల్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ ఈవెంట్ లోనూ అదరగొట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 24న ఈ ఈవెంట్ స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version