వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం : కేంద్రమంత్రి కృష్ణపాల్ గుర్జార్

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమని ఉద్ఘాటించారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు కృష్ణపాల్ గుర్జార్. నియోజకవర్గాల ఇంచార్జీలు పార్టీ బలాన్ని అంచనా వేయడమే కాకుండా, మరింత పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారన్నారు కృష్ణపాల్ గుర్జార్.

గత 8 ఏండ్లలో మోడీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తమన్నారు కృష్ణపాల్ గుర్జార్. టీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్న కృష్ణపాల్ గుర్జార్.. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేశారని, బీజేపీ అధికారంలోకి రాగానే ఇండ్లు, ఉద్యోగాలు ఇస్తామని భరోసా కల్పిస్తామన్నారు. దేశంలో 18వేల గ్రామాల్లో విద్యుత్, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి ఏడాదిలోపే నెరవేర్చినట్టు చెప్పారు కృష్ణపాల్ గుర్జార్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version