T20I & ODI మ్యాచ్‌లో ఆడే భారత జట్టు ఆటగాళ్లు వీరే!

-

ఇంగ్లాండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ మ్యాచ్‌ల కోసం భారత జట్టును ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా కారణంగా ఎడ్జ్‌ బాస్టన్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్‌లకు సారథిగా వ్యవహరించనున్నారు. అయితే, గతేడాది వాయిదా పడిన రీ షెడ్యూల్ ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, టెస్ట్ మ్యాచ్‌లో ఆడే ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో విశ్రాంతి కల్పించాలని ఐసీసీఐ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు రెండు జట్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇండియన్ క్రికెట్ టీమ్

మొదటి టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్, సంజు శాంసన్, దీపక్ హుడా, సూర్యకుమార్, దినేష్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ ఉంటారు.

రెండవ, మూడవ టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలి, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.. మ్యాచ్‌లలో ఆడనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version