తెలంగాణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త

-

తెలంగాణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు.రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖకు ఆయన స్పందిస్తూ తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. రాష్ట్రం పంపిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(IDTR) ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సమాధానమిస్తూ.. 2.5 కోట్ల జనాభాకు ఒక ఐడీటీఆర్‌‌కు మాత్రమే అర్హత కలిగి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కరీంనగర్‌లో ఐడీటీఆర్‌ పనిచేస్తోందని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.

మూడు ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(RDTCS), ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం (DTS) కోసం తెలంగాణ అర్హత సాధించినదని శుభవార్త వెల్లడించారు. వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపొచ్చని బదులిచ్చారు. ఆటోమేటిక్ స్టేషన్‌‌లకు కేంద్రం 30శాతం గ్రాంట్ అందిస్తుందని, జిల్లాకు రూ.1.50 కోట్లు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news