తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల పై కాసేపట్లో కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవ్వనున్నారు. ఈ భేటీలో కృష్ణా నీటి కేటాయింపులపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ని కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించబోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన నిధుల విషయం మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పని తీరు, పార్టీ పని తీరును పార్టీ పెద్దలకు వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో ఎమ్మెల్యే ‘
కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక పై హైకమాండ్ తో
చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి దక్కబోతున్నాయనేది తెలంగాణ కాంగ్రెస్ లో
ఉత్కంఠగా మారింది.