తెలంగాణలో సమైక్యవాదులు..ఇదేం ట్విస్ట్..!

-

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఈడీ, ఐటీ దాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైకి బీజేపీపై విరుచుకుపడుతున్నారు గాని లోలోపల మాత్రం కారు నేతలు టెన్షన్ పడుతున్నారు. అలాగే రాజకీయంగా బీజేపీ నేతలు..కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు. అదే సమయంలో కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవడం పెద్ద తలనొప్పి. అరెస్ట్ అయిన పర్లేదు అని కవిత అంటున్నారు గాని..అదే జరిగితే కేసీఆర్‌కు పెద్ద డ్యామేజ్.

ఇదే సమయంలో షర్మిల వ్యవహారం పంటికింద రాయి మాదిరిగా తయారైంది. ఇప్పటికే ఆమె..కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు. దీంతో ఆమెని నిలువరించాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు చేయడం, విఫలమవ్వడం జరిగాయి. పైగా ఏం చేయాలో తెలియక…షర్మిల బీజేపీ వదిలిన బాణం అని, ఐటీ, ఈడీలతో బీజేపీ డ్రామా ఆడుతుందని విమర్శలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు చేసిన కొన్ని తప్పిదాల వల్ల దర్యాప్తు సంస్థలకు టీఆర్ఎస్ నెట్లు వణుకుతున్నట్లే కనిపిస్తున్నారు.

ఇలాంటి పరిస్తితుల్లో టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు నానా కష్టాలు పడుతున్నారు..బీజేపీ కక్ష సాధిస్తుందని సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ మొదలుపెట్టారు. తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్ళీ సమైక్యవాదుల కుట్ర అంటూ స్టార్ట్ చేశారు. బీజేపీ దత్తపుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో సీఎం కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేస్తోందని, ఏడాది కాలంగా రాష్టంలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు.

ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని మళ్ళీ కబ్జా చేసేందుకు వస్తున్నారని, 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని గుర్తు చేస్తున్నారు. అంటే మళ్ళీ ఏపీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఏదో చేసేస్తున్నారని చెప్పి సెంటిమెంట్ లేపే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ప్రతి సారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అంటే కష్టమే. మరి ఈ సారి కేసీఆర్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version