వీకెండ్ పవన్..జనసేన ఎక్కడ?

-

ఓ వైపు సినిమా షూటింగ్‌లు చేస్తూ..గ్యాప్ దొరికినప్పుడు పవన్..ఏపీకి వచ్చి అక్కడున్న ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారు..అలాగే వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడతారు. ప్రభుత్వ విధానాలని తప్పుబడతారు. అలాగే నెక్స్ట్ వైసీపీని గద్దె దించుతామని సవాల్ చేస్తారు. ఇంకా అంతే అలా సవాల్ చేసి హైదరాబాద్‌కు వెళ్లిపోతారు. మళ్ళీ వీలు కుదిరినప్పుడు వస్తారు. అందుకే పవన్‌ని వైసీపీ నేతలు వీకెండ్ నాయకుడు అంటున్నారు. అలా విమర్శలు చేయడంలో తప్పులేదని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ అలాగే చేస్తున్నారు.

సరే సినిమా షూటింగ్‌లు చేసుకోవడం తప్పు కాదు..అప్పుడప్పుడు రావడం కూడా తప్పు కాదు. కానీ పార్టీని ఒక దారికి తీసుకురావడం, బలోపేతం చేయడం..వైసీపీ-టీడీపీలకు ధీటుగా పార్టీని పెంచడం చేయాలి. పవన్ అవేమీ చేయడం లేదు. వస్తారు..ప్రజా సమస్యలపై మాట్లాడతారు..వైసీపీపై ఫైర్ అవుతారు..వెళ్లిపోతారు. ఇంకా అంతే పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలి. 175 స్థానాల్లో పార్టీకి బలమైన నాయకులు కావాలి. పోనీ 175 వదిలేసిన..ఇప్పుడు బలంగా ఉన్న స్థానాల్లో ఇంకా ఎలా బలపడాలి. ఎలాంటి అభ్యర్ధులని ఎంపిక చేయాలి. అసలు తన సీటు ఏది.. గత ఎన్నికల్లో ఎలాగో ఓడిపోయాం..ఈ సారి ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఒక సీటుని ఎంపిక చేసుకుని..అక్కడ తన బలం పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. అటు జనసేన నేతలు పవన్ లేకపోతే పనిచేయడం మానేస్తున్నారు. ఇలా ఉంది జనసేన పరిస్తితి. ఓ వైపు ఏమో టీడీపీ,వైసీపీలు ప్రజా క్షేత్రంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. చంద్రబాబు-జగన్ జిల్లాల టూర్లతో బిజీగా ఉన్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు.

మరోవైపు అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ చూస్తున్నారు..అలాగే నేతలని ఇంటింటికి పంపుతున్నారు. మరి పవన్ ఏం చేస్తున్నారు..జనసేన నేతలు ఏం చేస్తున్నారు. అనేది క్లారిటీ లేదు. ఇకనైనా పవన్ పూర్తిగా జనాల్లోకి వచ్చి…జనసేనని బలోపేతం చేయాల్సి ఉంది. లేదంటే మళ్ళీ దెబ్బతినడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version