గ్రేటర్ వరంగల్‌లో కరపత్రాల కలకలం

-

వరంగల్ లో కరపత్రాల వల్ల హాదైవిడి జరిగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కరపత్రాలు హల్చల్ చేశాయి. నగర అభివృద్ధి కాంక్షించే పౌరుల పేరుతో కరపత్రాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. జిడబ్ల్యూఎంసి కి పూర్తిస్థాయి నిజాయితీగల ఐ.ఎ.ఎస్. అధికారిని నియమించాలని అందులో పేర్కొన్నారు. రెండేళ్లు గడిచినా కూడా ఇంకా జిడబ్ల్యూఎంసి లో ఫ్లోర్ లీడర్లకు పార్టీల వారీగా గదులు కేటాయించలేదని.. వెంటనే గదులు కేటాయించాలని కరపత్రంలో డిమాండ్లు ఉన్నట్లు సమాచారం.

ప్రతి నెల లోని చివరి వారంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని వారు ఆ కరపత్రాలతో పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటి ఏర్పాటుతో పాటు.. కో-ఆప్షన్ సభ్యుల నియామకంలో అలసత్వాన్ని వీడి.. తక్షణమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ మున్సిపాల్టీకి సంబంధించిన స్థలాలను కొంతమంది కబ్జా చేసి ప్లాట్లుగా అమ్ముతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అందులో ప్రశ్నించినట్లు తెలుస్తుంది. స్థానికులు సిటి ప్లానర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కరపత్రంలో ఉన్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version