రేపటి నుంచి ‘ఈ-గ‌రుడ’ పేరుతో ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు

-

12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ).. వాటిలో 10 బస్సులను వాడకంలోకి తెస్తోంది.

అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు ‘ఈ-గరుడ’గా సంస్థ నామకరణం చేసింది. మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్ప‌క్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఈ బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. అయితే హైద‌రాబాద్ – విజ‌య‌వాడ మార్గంలో మొత్తం 50 ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని టీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యించింది. దాంట్లో భాగంగా రేపు 10 బ‌స్సుల‌ను అందుబాటులోకి తేనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version