స్నానం చేయకుండా నిద్రపోతే అక్కడ జరిమానా తప్పదట.. నవ్వకపోతే ఫైన్‌ కట్టాల్సిందే..!  

-

కొన్ని దేశాల్లో ఉండే చట్టాలు చూస్తే.. మీకు కచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేం చట్టాలురా బాబు అనిపిస్తుంది. నిద్రపోయే ముందు స్నానం చేస్తే.. ప్రశాంతంగా నిద్రపడుతుంది.. అది మన ఇష్టంరాబై.. చేస్తే చేస్తాం లేదంటే లేదు. కానీ ఆ దేశంలో స్నానం చేయకుండా నిద్రపోతే తీసుకెళ్లి జైల్లో ఏస్తారట. అది నేరమే.! నవ్వకపోతే లొల్లే.. ముఖం మాడ్చుకుని తిరిగితే జరిమానా విధిస్తారు. ఇలాంటి క్రేజీ కండీషన్స్‌ ఇంకా చాలా ఉన్నాయి.. అవేంటో చూద్దామా..!
ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో ఓ వింత చట్టం అమల్లో ఉంది. అక్కడ ఎవరైనా స్నానం చేయకుండా నిద్రపోతే చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా స్నానం చెయ్యకుండా నిద్రపోయినందుకు జైలు శిక్ష కూడా విధిస్తారు.
పావురాలకు ఆహారం ఇస్తే శాన్‌ఫ్రాన్సిస్కో, ఇటలీలలో నేరంగా పరిగణించబడుతుందట. మన దగ్గర చాలామంది పావురాలకు ఆహారం వేస్తారు కదా..!
కానీ అక్కడ ఎవరైనా పావురాళ్లకు గింజలు వేస్తూ కనిపిస్తే వెంటనే అరెస్ట్‌ చేస్తారక్కడ.
జపాన్‌లో ఉబకాయం క్షమించరాని నేరం. 2008లో మెటాబో లాను జపాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది.
లోదుస్తులతో ఎవరైనా కారును శుభ్రం చేస్తే అందుకు గానూ జరిమానా విధిస్తుంది అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో.
స్విట్జర్లాండ్‌లో ఎవరైనా రాత్రి 10 గంటల తర్వాత బాత్‌రూంలో ఫ్లష్ చేసినా లేదా బాత్ రూం నుంచి ఏ విధమైన శబ్దం వచ్చినా జరిమానా విధిస్తారట.
ఇటలీలోని మిలాన్‌లో బహిరంగంగా సంచరించే ప్రతి పౌరుడూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి. ఎవరి ముఖం మీదనైనా నవ్వు మాయం అయ్యిందో.. దానిని వెంటనే తీవ్ర నేరంగా పరిగణించి వంద డాలర్ల వరకు జరిమానా విధిస్తారట. దీంతో రోజుకు వందల మంది ఈ జరిమానాల బారీన పడుతున్నారట. ఐతే ఆసుపత్రి, అంత్యక్రియలకు వెళ్లే సమయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది.
హాంకాంగ్‌లో భర్త తన భార్యను మోసం చేస్తే.. భార్య చేతులతో భర్తను చంపడం అక్కడ చట్టబద్ధంగా పరిగణించబడుతుంది. అయితే..తన చేతులతో భర్తను చంపడం ఇష్టపడక పోతే ఇతర మార్గాల్లో శిక్షను అమలు చేసే వెసులుబాటు ఉంది
సింగపూర్‌లో 1992 జనవరి 3 నుంచి చూయింగ్‌ గమ్‌లను అమ్మడం, తయారు చేయడం నేరంగా పరిగణించారు.. అయితే నోటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారు డాక్టర్‌ సలహామేరకు చూయింగ్‌ గమ్‌ నమలవచ్చని 2004లో అక్కడి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
సాధారణంగా ఏ దేశ ప్రభుత్వమైనా రోడ్లపై స్పీడ్‌గా డ్రైవ్‌ చేసే వారిని కఠినంగా శిక్షిస్తుంది. జర్మనీలోని ఆటోబాన్‌ రోడ్ల మీద మాత్రం కోరుకున్నంత స్పీడ్‌గా డ్రైవ్‌ చేయవచ్చు. అయితే.. కారులో సరిపడినంతగా ఆయిల్‌ కచ్చితంగా ఉండాలి. ఒకవేళ రోడ్డుపై హఠాత్తాగా కారు ఆగిపోతే వెంటనే జరిమానా కట్టవల్సి ఉంటుంది.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version