అక్టోబర్ నుండి అన్ లాక్ 5.0.. ఏమేమి తెరుచుకోనున్నాయి?

-

అక్టోబర్ 1వ తేదీ నుండి అన్ లాక్ 5.0 అమల్లోకి రానుంది. ఇప్పటికే మాల్స్, షాపింగ్ సెంటర్లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అన్ లాక్ 5.0లో భాగంగా ఏమేమి తెరుచుకోనున్నాయనేది ఆసక్తిగా మారింది. అందరూ అనుకుంటున్నట్లు థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్ స్టార్ట్ అవుతాయా అనేదే అనుమానం. తాజా సమాచారం ప్రకారం థియేటర్లలో సినిమా ప్రదర్శనకి అనుమతులు లభించే అవకాశం కనిపిస్తుంది. కోవిడ్ నియమాల మధ్య థియేటర్లు ఓపెన్ చేయాలని భావిస్తున్నారట. కరోనా వైరస్ తగ్గుదల, రికవరీ పెరుగుదల రేటు మొదలగు వాటి కారణంగా థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుండి థియేటర్లు తెరుచుకోవచ్చునని అనుమతులు ఇచ్చింది. ఎక్కువ మందికి అవకాశం లేకుండా కఠిన నియమాల మధ్య జాతరలు, సినిమాలు, మ్యూజిక్ షో జరుపుకోవచ్చని తెలిపింది.

ఇంకా పర్యాటక రంగానికి పరిమితులు తీసేసే అవకాశం ఉంది. కోవిడ్ వల్ల పూర్తిగా దెబ్బతిన్న రంగం ఏదైనా ఉందంటే అది పర్యాటక రంగమే అని చెప్పుకోవచ్చు. అన్ లాక్ 5.0లో భాగంగా పర్యాటక ప్రదేశాలకు సందర్శకులను అనుమతులు ఇస్తారట. తాజ్ మహల్ సందర్శనకి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రం, అక్కడికి వచ్చే పర్యాటకులకి పరిమితులని దాదాపుగా తీసివేసింది.

ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రతీ వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్ నియమాల ప్రకారం అన్నీ తెరుచుకోనున్నాయి. మరి అధికారిక ప్రకటనలో ఏముంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version