ఇదిగో ప్రూఫ్: ఏబీఎన్ వేరు.. ఆంధ్రజ్యోతి వేరు!!

-

డైరెక్టుగా పాయింట్ లోకి వచ్చేస్తే… పురందేశ్వ‌రి ఇంట‌ర్వ్యూపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఘాటుగా స్పందించిన అంశంపై ఏబీఎన్ లో డిబెట్ నిర్వహించారు! ఈ డిబేట్ ఏ ఉద్దేశ్యంతో, ఏ ఆశయంతో పెట్టారో తెలియదు కానీ… ఫలితం మాత్రం పురందేశ్వరికి నెగిటివ్ అయ్యింది! ఇదే సమయంలో ఇదే అంశంపై ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది.. అది మాత్రం కాస్త బలంగా ఉంది! ఇంతకూ ఏది నిజం!!

పురందేశ్వరి జాతి నాయ‌కురాలంటూ విజ‌య‌సాయిరెడ్డి కులం కోణంలో విమ‌ర్శించ‌డాన్ని తాజాగా ఏబీఎన్ డిబేట్ ‌లో పాల్గొన్న నేత‌లు అంతా ఖండించారు. ఇందులో భాగంగా ప్ర‌జెంట‌ర్ మాట్లాడుతూ… అస‌లు విజ‌యసాయిరెడ్డి ట్వీట్‌ పై ఏపీ బీజేపీ నేత‌ల స్పంద‌న ఏంటి? అని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి భానుప్ర‌కాశ్ ‌రెడ్డిని గ‌ట్టిగా నిల‌దీశారు. ఆఖరికి రాష్ట్ర బీజేపీ ఇన్‌ చార్జి సునీల్‌ దేవధర్ మాత్రం ట్విట‌ర్ ‌లో ఖండించార‌ని తేల్చి చెప్పారు. ఫలితంగా… పురందేశ్వ‌రికి ఏపీ బీజేపీ నుంచి ఎలాంటి నైతిక మ‌ద్ద‌తు లేద‌నే విషయాన్ని తేల్చి చెప్పింది ఏబీఎన్!

ఆ సంగతులు అలా ఉంటే… ఆంధ్రజ్యోతి లో “కమలనాథులు ఆగ్రహం…” అంటూ ఒక వార్త ప్రచురించింది. అందులో… విజయసాయి వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.. వైసీపీ వైఫల్యాలను ఎత్తిచూపితే పురంధేశ్వరిపై కులంపేరుతో దాడి చేస్తారా? అంటూ కమలనాథులు ఫైర్ అవుతున్నారు? అంటూ కాస్త కవర్ చేసే ప్రయత్నం చేశారు! ఇంతకూ బీజేపీ నేతలు ఖండిచారా లేదా? పురందేశ్వరికి ఏపీ బీజేపీ నేతల నుంచి నైతిక మద్దతు ఉందని చెప్పడం ఆంధ్రజ్యోతి ఉద్దేశ్యమైతే… లేదు అని చెప్పడం ఏబీఎన్ ఉద్దేశ్యమా? వియ్ రిపోర్ట్ – యు డిసైడ్!!

 

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version