ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఐక్యరాజ్య సమితి నుంచి అరుదైన ఆహ్వానం అందింది. ‘‘ ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రిల్చర్; గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఆయన ఐరాసలో ప్రసంగించాల్సిందిగా సీఎం చంద్రబాబుని యూఎన్ఓ ఆహ్వానించింది. దీంతో వచ్చేనెల 24న న్యూయార్క్ లో జరగనున్న సదస్సులో సీఎం కీలక ఉపన్యాయం చేయనున్నారు. ఏపీ లో అనుసరిస్తున్న ‘జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానాన్ని’ యూఎన్ఓ ప్రశంసించింది. 2024లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ పద్ధతిలో సాగు చేయడానికి యూఎన్ఓ సాయం చేయనుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి సత్తాను సీఎం చాటనున్నారు.