విప్లవ రచయిత సంఘం (విరసం) నేత వరవరరావుతో సహా మరో నాలుగురు పౌరహక్కుల నేతలను మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..దీంతో వారంతా సుప్రీం కోర్టుని ఆశ్రయించగా..వారిని అరెస్ట్ చేయడం కంటే..వారి ఇళ్ల వద్దనే ఉంచి విచారణ జరపవచ్చు అంటూ పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టుకు నివేదించిన పిటిషన్లో .. పూణే పోలీసులు తమపై తప్పుడు చార్జీ షిట్ మోపారని..దీనిపై స్వతంత్ర విచారణ జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో వారు కోరారు… దీంతో వాస్తవాలను పరిశీలించిన సుప్రీం కోర్టు.. ఐదుగురు పౌరహక్కుల నేతలను సెప్టెంబర్ 6 వరకు గృహ నిర్బంధంలోనే ఉంచాలంటూ.. ఈలోపు మహారాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.