టీడీపీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు హరికృష్ణ ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలుగు లోకాన్ని కలిచివేసింది. తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూడటానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు మెహిదీపట్నంలో ఉన్న హరికృష్ణ నివాసానికి వస్తున్నారు.
చాలామంది ఆయనకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. ఇక.. డైరెక్టర్ క్రిష్ కూడా హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ.. హరికృష్ణ చిన్ననాటి ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో అదే.
మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం, చిన్న నాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం.. అంటూ ఆఫోటోకు క్యాప్సన్ కూడా పెట్టాడు. 1962 తీసిన ఫోటో అది. దేశ రక్షణ కోసం ఎన్టీఆర్ విరాళాలు సేకరిస్తున్న సమయంలో తండ్రి ముందు నడుస్తున్న హరికృష్ణ అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. ఇక.. ఈ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందమూరి అభిమానులు ఈ ఫోటోను వైరల్ చేస్తూ హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు.
మార్పుకోసం రామ రధ చక్రాలు నడిపిన చైతన్యరధసారధ్యం
చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం#NandamuriHarikrishna garu leading NTR garu during the National Defence Fund activity in 1962.. pic.twitter.com/8LXvDP8Dzw— Krish Jagarlamudi (@DirKrish) August 29, 2018