దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో 92,071 కొత్త కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. 1,136 మరణాలు మన దేశంలోగత 24 గంటల్లో నమోదయ్యాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. మొత్తం కేసులు 48 లక్షలను దాటాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 48,46,428 గా ఉంది. వీటిలో 9,86,598 క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది.
37,80,108 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. 79,722 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. దేశంలో అత్యధిక కేసులు 5 రాష్ట్రాల నుంచే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు కూడా ఈ రాష్ట్రాల్లో అధికంగా ఉంది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.