నందమూరి సింహంతో పవర్ స్టార్.. నాగబాబు పోస్ట్..!

-

నందమూరి బాలకృష్ణ ని కెలకడమే పనిగా పెట్టుకుంటారు మెగా బ్రదర్ నాగబాబు. అందుకే ఆయన చేసే ప్రతీ పనికి, ఆయన మాట్లాడే ప్రతీ మాటకి అందరికంటే ముందుగా రియాక్ట్ అవుతున్నారు నాగబాబు. కానీ, ఇదంతా ఒకప్పటి మాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వారి మధ్య ఎలాంటి వివాదాలు జరగలేదు, పైగా నందమూరి బాలకృష్ణ తనకు సోదరుడి లాంటివాడని చెప్పేశాడు నాగబాబు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే నాగబాబు.. తాజాగా.. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఒక పాత ఫోటోని ఇన్‌‌‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి…’ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి, నా దగ్గర దాచానంతే !’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఆ తర్వాత మరో ఫోటో షేర్ చేసి చెప్పా కదా ఇంకా చాలా ఉన్నాయని.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మనం పెట్టె ఫోటోలతో గ్యాలరీ నిండిపోవాలంతే అని క్యాప్షన్ పెట్టాడు. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా మరో ఫోటో పోస్ట్ చేశాడు నాగబాబు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆ ఫోటోలో నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. పైగా దానికి క్యాప్షన్ గా.. బ్రదర్స్ టు గ్యదర్.. ఒకడు సొంత తమ్ముడు.. మరొకరు వేరే తల్లి నుంచి వచ్చిన సోదరుడు.. అని పెట్టాడు. అలాగే పవర్ స్టార్, నందమూరి సింహాన్ని కలిసిన రోజుది ఈ ఫోటో అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version