అన్ స్టాపబుల్ : బాలయ్య ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన పవన్..!

-

త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్ కి ఎలాగో రికార్డ్స్ వస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నుంచి ఒక ప్రశ్న, జవాబు ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు బాలయ్య అభిమానులలో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పై భారీ బస్ ఏర్పడింది. పవన్ తో ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ షో షూటింగ్ ముగిసింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య ఏమడిగి ఉంటారు? పవన్ ఏమి సమాధానాలు ఇచ్చి ఉంటారని? విషయమై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

అదే సమయంలో ఈ ఎపిసోడ్ నుంచి చిన్న బిట్ లీక్ అయింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేమిటంటే “అన్నయ్య దగ్గరనుంచి ఏం నేర్చుకున్నారు?” అని బాలయ్య ప్రశ్నించగా.. అందుకు పవన్ కళ్యాణ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు. అది ఆయన మనసులో నుంచి వచ్చింది. అదే “కష్టపడే స్వభావం నేర్చుకున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈ సమాధానం విన్నాక పవన్ కళ్యాణ్ పై అప్పటిదాకా ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఒకవైపు సినిమాలు.. మరొకవైపు సమాజ సేవ.. ఇంకొక వైపు రాజకీయాలు.. అన్నింటిని ఒంటె చేత్తో లాక్కు రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను ఎవరు కొట్టలేరు అనేది నిజం. ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version