కరోనా అంతానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను వేగవంతం చేసింది. ఇటీవలే 100 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రికార్డ్ నమోదు చేసింది. దేశంలో అత్యధిక డోసులు టీకాలు వేసిన రాష్ట్రంగా ఘనత సాధించింది. 13 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఆ రాష్ట్ర ప్రజలకు అందించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఉత్తర్ ప్రదేశ్ కన్న మహారాష్ట్ర వెనుకబడి ఉంది. రాష్ట్రంలో అర్హులైన ప్రజల్లో 66.14 శాతం వారికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ను అందించారు. 21.51 శాతం మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ను పొందారు.
వ్యాక్సినేషన్ లో యూపీ రికార్డ్… దేశంలోనే ఫస్ట్ ప్లేస్
-